ఏపీలో వైఎస్ జగన్ పాలనలో యువతకు ఉపాధి కలగానే మిగిలిపోతుందని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఎన్నికలకు ముందు యువతకు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక యువత నెత్తిపై భస్మాసుర హస్తం పెట్టారని మండిపడ్డారు. 2.30 లక్షల ఉద్యోగాల ఖాళీల భర్తీ, జాబ్ క్యాలెండర్‌పై.. జగన్‌ను నిరుద్యోగులు నిలదీయాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం దినదినం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.