జగన్ పాలన పిచ్చి తుగ్లక్ పాలన ను గుర్తుకు తెస్తోందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. వేంపల్లి పట్టణంలో ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయుల హాజరుకు ముఖ హాజరు యాప్ ను ప్రవేశపెట్టడం ఇందుకు తాజా ఉదాహరణ ఈ యాప్ వలన పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఫోన్లతో కుస్తీ పడుతున్నారు. మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. పాఠశాలల పర్యవేక్షణ కోసం ఎంఈఓ వ్యవస్థ ఉంది.
కానీ 75 శాతం ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంఈఓ పోస్టులు భర్తీ చేయకుండా ముఖ హాజరు యాప్ ను ప్రవేశపెట్టడం విడ్డూరం ఆ యాప్ లు కూడా సక్రమంగా పని చేయడం లేదు కమీషన్ ల కకుర్తి తో పనికి మాలిన యాప్ లు , సర్వర్లు కొన్నారు. లేదా సమర్థవంతమైన ముఖ హాజరు యాప్ ను ఉపయోగించాలన్నారు.