సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు అండ్ కో ఓర్వలేక ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అమర్‌నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులకు సంబంధించి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మాజీ ఐటీ శాఖ మాజీ మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కనీస అవగాహన లేకుండా విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నఅభివృద్ధి, వస్తున్న పెట్టుబడులను చూడలేక.. వారు పడుతున్న ఆవేదన, కడుపు మంట.. వారి మాటల్లోనే కనిపించింది. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా.. అది మేమే చేశామని లోకేష్ చెబుతున్నాడు. వెయ్యికోట్లు పెట్టుబడులు పెట్టే సంస్థలను తాము వందల్లో తీసుకువచ్చామని చెబుతున్నాడు. వాళ్ల నాన్న చంద్రబాబుకు ఆ సంస్థలకు శంకుస్థాపన చేసే సమయం కూడా లేదని చెప్పుకోవడం సిగ్గుచేటు. అదే నిజం అయితే, టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు- పెట్టుబడుల వివరాల జాబితా ఏమిటో విడుదల చేయాలి. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు మతితప్పి మాట్లాడుతుంటే... వెయిట్ లాస్ కోసం నారా లోకేష్ ట్రీట్‌మెంట్ తీసుకుని మైండ్ లాస్ చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని తెలియజేసారు.