విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి 27వ వార్డు, ఆసిల్ మెట్ట, అశోక్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైస్సార్సీపీ నాయకులతో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మెటీరియల్ రాని కారణంగా కార్యక్రమం చేయలేక పోతున్నామని చాలా జాప్యం జరుగుతోందని అందుకోసం అధికారులను విజ్ఞప్తి చేశామని చెప్పారు. వైస్సార్సీపీ నాయకులకు తమ తమ వార్డ్, సచివాలయం పరిధిలో ఇంకా ప్రోగ్రాం జరగని సచివాలయాల అడ్మిన్ లకు ఫోన్ చేసిన గడప గడప కి సంబందించిన మెటీరియల్ వచ్చిన వెంటనే కార్యక్రమం చేయటానికి అందుబాటులో ఉండాలని తెలిపారు.