నిరాధార సమాచారంతో కాకినాడ జిల్లా అధికారుల మధ్య అంతరం, జిల్లా యంత్రాంగం మధ్య గందరగోళం సృష్టించే విధంగా వార్తలు టెలికాస్ట్ చేయడం దురదృష్టకరం అని ఎస్పీ తెలియజేసారు. అసత్య ప్రచారాలు, తప్పుడు సమాచారాలు, నిరాధార వార్తలు టెలికాస్ట్ చేసి జిల్లా పరిపాలనా యంత్రాంగం లో ఉద్యోగ వర్గాల మధ్య వైషమ్యాలు ప్రేరేపించే విధంగా బుధవారం సాయంత్రం "Of The Record" అనే కార్యక్రమంలో ప్రసారం చేసిన NTV న్యూస్ ఛానల్ పై చట్టపరమైన చర్య లు తీసుకోవలసి ఉంటుంది. ఇటువంటి నిరాధార వార్తలు ప్రచారం చేయడం చాలా బాధాకరమైన విషయo అని తెలియజేసారు.