ఇకపై రైళ్లలో నాలుగేళ్లలోపు పిల్లలకు కూడా పెద్దవాళ్లలాగే టికెట్ తీసుకోవాలంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని రైల్వే శాఖ తెలిపింది. పిల్లలకు టికెట్ల బుకింగ్ విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పింది. ఐదేళ్లలోపు పిల్లలు ఫ్రీగానే ప్రయాణించొచ్చని తెలిపింది. ఒకవేళ ప్రత్యేకంగా బెర్త్‌లు/సీట్లు కావాలనుకుంటే అప్పుడు టికెట్లు తీసుకోవాలని, ఆ టికెట్లకు పెద్దవారి టికెట్ల ఛార్జీలే వర్తిస్తాయని తెలిపింది.