ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో 19 న శుక్రవారం ప్రొద్దుటూరు స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రచారకులు నిరంజన్ ప్రభు తెలిపారు. గురువారం స్థానిక ఇస్కాన్ ప్రచార కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ భక్తిని ప్రతి ఒక్కరికీ పంచాలనే ఉద్దేశ్యంతో శ్రీల ప్రభు పాదుల వారు అమెరికాలో ఇస్కాన్ ను స్థాపించి అక్కడ నుండి భక్తి ప్రచారం ప్రారంభించారని వివరించారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఇస్కాన్ ప్రచార కేంద్రాలు వున్నాయని, అన్ని కేంద్రాలలో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయని తెలిపారు. యువతకు ఇస్కాన్ పై అవగాహన కల్పించడం తమ ధ్యేయమన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు హరినామ సంకీర్తన, కృష్ణా, బలరాముల దర్శనము, 7 గంటలకు గౌర హారతి, రాత్రి 10. 30 కి శంఖాభిషేకం, పుష్పాభిషేకం, మహా హారతి, తీర్థ ప్రసాద వితరణ వుంటుందని వివరించారు. ప్రజలు పాల్గొని కృష్ణ కృపకు పాత్రులు కావాలని సూచించారు.