'రామసేతు'ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం బెంచ్‌లోని ఇతర జడ్జీలతో సంప్రదింపులు జరుపుతామని, ఈ అంశాన్ని విచారణ జాబితాలో చేరుస్తామన్నారు. ఈ కేసు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, అత్యవసర విచారణ అవసరం అని పిటిషనర్ బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి సుప్రీంకు విన్నవించారు.