జమ్మూకశ్మీర్‌లో స్థానికేతరులకు కూడా ఓటు హక్కు కల్పించాలని ముఖ్య ఎన్నికల అధికారి హిర్దేశ్ కుమార్ నిర్ణయించారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు సహ అక్కడ నివసించే స్థానికేతరులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముమ్మాటికి బీజేపీకి లబ్ధి చేకూర్చే పనేనని, బీజేపీ ఓటర్లను దిగుమతి చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నాయి.