కొబ్బరినూనెలో అలోవెరా లేదా గ్రీన్ టీ ఆకులు వేసి వేడిచేసి, తలకు పట్టించండి. ఇలా వారానికి రెండు సార్లు రాస్తే జుట్టు కుదుళ్ల నుంచి బలంగా తయారవుతుంది. పొడిబారడం, చివర్లు చిట్లడం వంటి సమస్యలు పోతాయి. జుట్టు వర్షానికి తడిస్తే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. కండిషనర్ కూడా వాడాలి. డ్రయర్ లను వాడకపోవడమే మంచిది. ఎందుకంటే అవి జట్టులోని తేమను దూరం చేస్తాయి. అలాగే పెద్ద పళ్లున్న దువ్వెన వాడాలి.