ధర్మవరం: మండలంలోని ఏలుక్కుంట్లకు చెందిన ప్రణీత్ (26) అనే యువకుడు మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడని ధర్మవరం గ్రామీణ పోలీసులు తెలిపారు. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో అతను పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.