లేపాక్షి: లేపాక్షి గ్రామానికి చెందిన జయశ్రీ (18) అదే గ్రామానికి చెందిన పవన్ తో ప్రేమలో పడింది. ప్రియునితో ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. జయశ్రీ పుట్టింటికి వెళ్లగా తండ్రి సరిగా మాట్లాడలేదని మనోవేదనకు గురై తన చున్నితో ఫానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ మునీర్ అహ్మద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.