ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇకపై ఏపీలో కరెంటు సమస్యలు తీరనున్నాయి. వచ్చే 6 నెలల్లో ఏపీలో 1,600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలియజేశారు. అక్టోబరు వరకూ కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టు నుంచి 800 మెగావాట్లు, వచ్చే ఏడాది ఫిబ్రవరికి ఎన్టీపీఎస్ నుంచి మరో 800 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రానుందని ఏపీ సర్కార్ తెలిపింది.