గుంటూరు, తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, సంఘం ప్రతినిధులు గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారి సామాజిక వర్గాన్ని కించపరిచే పదాలపై ప్రభుత్వం నిషేదం విధిస్తూ జీవో జారీ చేసి తమ ఆత్మగౌరవాన్ని కాపాడారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఛైర్మన్ సిద్దవటం యానాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.