భారత్ లో మొబైల్ గేమ్స్ ఆగడాలు ఇంకా తగ్గలేదు. తాజాగా పశ్చిమ బెంగాల్లో మరో కొత్త మొబైల్ గేమ్ బాలుడి ప్రాణాలు తీసేలా చేసింది. ఆ గేమ్ వివరాలు తెలియనప్పటికీ ఆ గేమ్ షరతు మాత్రం అందర్నీ ఉలిక్కి పడేలా చేస్తోంది. గేమ్ లో ఓడిపోయినవారు గెలిచిన వారి చేతిలో 200 చెప్పు దెబ్బలు తినే షరతు ఉంది. తూర్పు మేదినీపూర్ జిల్లాలోని పొటాష్పూర్ గ్రామంలో ఈ గేమ్ లో ఓడిన ఓ బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.