మే 19న రాత్రి కాకినాడలో జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఏపీలో సంచలనం రేపిన విషయం విధితమే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి నిరాశ తప్పలేదు. తనకు బెయిల్ ఇవ్వాలని ఇదివరకు రెండుసార్లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కోర్టుకు పిటిషన్ పెట్టుకోగా కోర్టు తిరస్కరించింది. మూడో పిటిషన్ దాఖలు చేయగా గురువారం విచారించిన కోర్టు ఈనెల 22న తిరిగి విచారణ చేపడుతామని వాయిదా వేసింది.