తన భార్య ధనశ్రీతో విడాకుల వార్తలపై టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్పందించాడు. సోషల్ మీడియాలో ధనశ్రీ తన పేరును ధనశ్రీ వర్మగా మార్చుకోవడంతో గందరగోళం నెలకొంది. ధనశ్రీ కేవలం డెంటిస్ట్ మాత్రమే కాకుండా యూట్యూబర్, కొరియోగ్రాఫర్ కూడా కావడంతో ఆమె విడాకుల వార్త వివాదాస్పదమైంది.అయితే ఈ జంట విడిపోనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై చాహల్ స్పందించాడు. తమ పెళ్లిపై వస్తున్న పుకార్లన్నీ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.