శారీరక, మానసిక ఆరోగ్యాలకు జామ మంచిది. నెలసరిలో నొప్పి, ఎన్‌టిడి లాంటి సమస్యలున్న మహిళలకు ఇది మేలు చేస్తుంది. జామలో విటమిన్లు, సోడియం, పొటాషియం, ప్రొటీన్లు ఉంటాయి. మంచి పోషకాహారం. నెలసరిలో వచ్చే నొప్పి, ఇబ్బందులకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. జామతో గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. రక్తంలో షుగర్ స్థాయిని జామ తగ్గిస్తుంది. హృద్రోగాలను అరికడుతుంది. జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది.