బాపట్ల: ఈ నెల 31న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా పరిధిలో పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహించదలచిన వారు తప్పని సరిగా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తెలిపారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఎస్.హెచ్.ఓ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.