గుజరాత్ సర్కార్ బిల్కిస్ బానో అత్యాచార నిందితులను క్షమాభిక్ష కింద విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల విడుదల పై తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే.. “ఒక మహిళగా, సివిల్ సర్వీసు అధికారిగా స్వేచ్చాయుత దేశంలో ఉన్నామన్న నమ్మకం కలగట్లేదు. ఈ వార్త విని షాకయ్యి అలానే కూర్చుండి పోయాను. స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్ బానో హక్కును మనం మళ్లీ తుడిచిపెట్టినట్టయింది.” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.