అమెరికాలోని టేనస్సీ జైలులో ఇటీవల విస్మయకర ఘటన జరిగింది. జాషు బ్రౌన్ అనే ఖైదీని కలవడానికి టేనస్సీ జైలుకు ఇటీవల అతడి ప్రేయసి రాచెల్ డోలార్డ్ వెళ్లింది. కొద్ది సేపు మాట్లాడిన తర్వాత గాఢంగా ముద్దిచ్చింది. ఆశ్చర్యకరంగా కాసేపటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆమె తన పెదవుల్లో మెథాంఫెటమైన్ అనే 14 గ్రాముల విషపూరిత డ్రగ్‌ను, ముద్దు పెట్టేటప్పుడు అతడి నోట్లోకి పంపింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.