కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ భల్లా పదవి కాలం మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు కేంద్ర రిక్రూట్‌మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీవోపీటీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.1984 కేడర్ ఐఏఎస్ అధికారి, భల్లా అస్సాం మరియు మేఘాలయ కేడర్‌కు చెందినవారు. 2019 ఆగస్టులో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. మరో మూడు రోజుల్లో ఆయన పదవీకాలం ముగియనుంది.