ఏపీలో సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నెల 23న వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద అకౌంట్‌లలో డబ్బులు జమ చేయనుంది. కృష్ణా జిల్లా పెడనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తారు. సీఎం బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి నేతన్నల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అర్హులను గుర్తింంచి, వారి జాబితాలను సచివాలయాలకు పంపించారు. ప్రభుత్వం గత మూడేళ్లుగా సొంత మగ్గం ఉన్న బిలో పావర్టీ లైన్ (బీపీఎల్) కుటుంబాలకు చెందిన వారికి ఈ పథకం కింద ఏటా రూ.24వేలు జమ చేస్తున్నారు. పెడన నియోజకవర్గం పరిధిలో 3,161 మంది వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్దిదారులు ఉన్నారు.
రాష్ట్రంలో చేనేత నేత కార్మికులకు వారి చేనేత పనులను మెరుగుపరిచేందుకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం కింద, ప్రతి ఏటా సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికుల బ్యాంకు ఖాతాలకు రూ. 24,000 నేరుగా జమ చేస్తున్నారు. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడు రూ .1.2 లక్షల మొత్తం సహాయాన్ని అందుకుంటారు. ఈ పథకం కింద, దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా ఉండాలి. దరఖాస్తుదారుడు వైఎస్ఆర్ నేథన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. అతను / ఆమె తప్పనిసరిగా వృత్తిపరంగా చేనేత నేతగా ఉండాలి.
అంతేకాదు ఈ పథకం ప్రకారం, దరఖాస్తుదారు చేనేత సంఘంలో నమోదు చేసుకోవాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా దారిద్య్ర రేఖ దిగువన ఉండాలి. మగ్గాలు ఎన్ని ఉన్నా ఒక కుటుంబంలో ఒకరికే ప్రయోజనం. సచివాలయాలు సిద్ధం చేసిన జాబితాను పరిశీలించి లబ్ధిదారులను గుర్తిస్తారు. వాలంటీర్లు, సిబ్బంది బయోమెట్రిక్ తీసుకుని ఎంట్రీ చేస్తారు. అలా ఎంట్రీ చేసిన జాబితా ఎంపీడీఓ, లేనిపక్షంలో ఎం.సీలు పరిశీలించి చేనేత శాఖ ద్వారా తుది జాబితా ప్రకటిస్తారు.
నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునేవారి అడ్రస్, ఆధార్ కార్డ్ లేని పక్షంలో ఓటర్ ఐడి కార్డ్ వంటి గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర చేనేత సంఘం జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెల్ల రేషన్ కార్డు/దారిద్య్ర రేఖ (బీపీఎల్) సర్టిఫికెట్, బ్యాంక్ ఖాతా వివరాలు అందించాలి. ఇప్పటికే సిద్ధం చేసిన నేతన నేస్తం లబ్ధిదారుల జాబితాలు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. సచివాలయాలలో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాలు ప్రదర్శించబడుతున్నాయి.