గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ప్రమాదంలో చిక్కుకున్నారు. కులుమనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ చరియలు విరిగిపడి ఘాట్ మధ్యలో విరిగి పడడంతో కార్పొరేటర్లు ఇరుక్కుపోయారు. ఈ నెల 16 నుంచి స్టడీ టూర్ లో ఉన్న విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 95 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులు బయలు దేరి వెళ్లారు. రాత్రి నుంచి రోడ్ పై బస్లలోనే విశాఖ నగర పాలకులు కాలం గడిపారు. ఘటన చోటుకు ఆర్మీ సిబ్బంది చేరుకున్నాప్పట్టికి వర్షం పడుతుండడంతో రోడ్ క్లియర్ చేసేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. చండీగఢ్ కు 240 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగింది. మింద్ ప్రాంతంలో జివిఎంసీ పాలకులు చిక్కున్నారు. నిన్న పాలకులు మునిసిపాలిటీలోనే పలు ప్రాంతాలను కార్పొరేటర్లు సందర్శించారు. ఇప్పటివరకు ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా కులుమనాలిని కార్పొరేటర్లు దర్శించారు.