రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హులైన 1.35 కోట్ల మంది మహిళలకు ఉచితంగా సెల్‌ఫోన్లు పంపిణీ చేయడంతోపాటు మూడేళ్లపాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో డిజిటల్ సేవా యోజన పథకాన్ని సీఎం గెహ్లాట్ ప్రకటించారు. అందులో భాగంగానే తాజాగా ఈ ప్రకటన చేశారు. కాగా, ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.