భారత్‌లోనూ మంకీపాక్స్ కేసులు కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్‌ను శుక్రవారం ఏపీలోని మెడ్‌టెక్ జోన్లో ప్రవేశపెట్టారు. ట్రాన్స్ ఏషియా బయో మెడికల్స్ రూపొందించిన కిట్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ ఆవిష్కరించారు. ఈ కిట్ అత్యంత సున్నితమైనది, ఉపయోగించడానికి సులభమైనదని ఆయన స్పష్టం చేశారు.