భారీ వర్షాల కారణంగా వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్షుల్ గార్గ్ శుక్రవారం తెలిపారు. వైష్ణోదేవి ఆలయానికి వచ్చే దారి అంతా వర్షాల వల్ల ప్రమాదకరంగా మారిందన్నారు. యాత్రికుల బేస్ క్యాంప్ అయిన కత్రాలో భారీ వర్షం కురవడంతో శనివారం వరకు యాత్రను నిలిపేశామని పేర్కొన్నారు.