చీమకుర్తి: గుడిపూడి వారిపాలెం గ్రామానికి చెందిన మహిళ కనిపించడం లేదంటూ శుక్రవారం ఆమె భర్త మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుండ్లపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న తల్లి వద్దకు వచ్చిన మహిళ, ఒంగోలులోని ఆసుపత్రికి వెళ్తున్నట్లు చెప్పి తన ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లింది. ఎంత సేపటికీ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించి చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.