తండ్రి వయసున్న వ్యక్తిని పెళ్లాడేందుకు నిరాకరించిన ఓ వైద్య విద్యార్థినిపై అమానుషంగా ప్రవర్తించారు. బలవంతంగా లాక్కెళ్లి గుండు గీయించి, కనుబొమ్మలు తొలంగించారు. అంతటితో ఆగకుండా లైంగికంగా వేధించారు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో గురువారం వైరల్ కావడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై పాకిస్థాన్‌లో ఆందోళనలు మిన్నంటాయి.