స్టడీటూర్ కోసం చండీగఢ్ వెళ్లిన గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు కులుమనాలిలో చిక్కుకుపోయారు. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో రాత్రి నుంచి కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో సహా రోడ్డుపై బస్సులోనే నిరీక్షిస్తున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని, ముప్పేమీ లేదని అధికారులు వెల్లడించారు. ఆర్మీ జవాన్లు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 2 రోజుల తర్వాతే వాహనాలు కదలనున్నట్లు సమాచారం.