ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గద్దలకొండ గణేష్ మూవీ రివ్యూ..

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2019, 02:34 PM

నటీనటులు: వరుణ్ తేజ్, పూజ హెగ్డే, అధర్వ మురళి, మృణాళిని, డింపుల్ హయతి(ఐటెం గర్ల్), బ్రహ్మాజీ, సత్య, బ్రహ్మానందం, రచ్చ రవి తదితరులు.


మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ. జె. మేయర్


సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్


ఎడిటింగ్: చోట. కె. ప్రసాద్


నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట


దర్శకత్వం: హరీష్ శంకర్


గద్దలకొండ గణేష్ లో వరుణ్ తేజ్‌ను నెగిటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్‌ లుక్‌లో చూపించడం ఆసక్తి కలిగించే అంశం. ఇక మొదటి నుండి మంచి అంచనాలున్న గద్దలకొండ గణేష్ సినిమాతో వరుణ్ మాస్ పాత్ర తో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడో అనేది సమీక్షలో తెలుసుకుందాం.


కథ:


గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) ఒక ఏరియాలో పెద్ద గ్యాంగ్ స్టర్ గా చలామణి అవుతుంటాడు. మరోపక్క అభిలాష్ (అధర్వ) సినిమాపై పిచ్చితో డైరెక్టర్ అవ్వాలని కలలు కనడమేకాదు..ఆ అందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాడు. అభిలాష్ సినిమా పిచ్చి తో ఇంట్లో వాళ్లతో గొడవపడి.. ఒక ఏడాది తిరిగేలోపు గొప్ప డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. అయితే అభిలాష్ కి ఓ గ్యాంగ్ స్టార్ కథతో సినిమా చెయ్యాలని ఉంటుంది దాని కోసం ఆ ఏరియాలో పెద్ద గ్యాంగ్ స్టర్ గా చలామణి అవుతున్న గద్దలకొండ గణేష్ జీవితాన్ని కథగా అమర్చాలని... గణేష్ కి తెలియకుండా గణేష్ ని ఫాలో చేస్తుంటాడు. అయితే అభిలాష్ గురించి గద్దలకొండ గణేష్ కి తెలిసిపోతుంది. అసలు గద్దలకొండ గణేష్ గ్యాంగ్ స్టార్ గా ఎందుకు మారాడు? అభిలాష్ కి గణేష్ కథ సినిమా తియ్యాలని కోరిక ఎందుకు పుట్టింది. చివరికి అభిలాష్, గణేష్ కథతో సినిమా చేశాడా? గద్దలకొండ గణేష్ కి అభిలాష్ గురించి తెలిసి అతన్ని ఏం చేసాడు? అనేది మిగిలిన కథ.


నటులు నటన:


గద్దలకొండ గణేష్ గా రఫ్ లుక్ లో గెడ్డం పెంచి అచ్చం విలన్ గా సినిమాని భుజాలపై మోశాడు. గద్దలకొండ గణేష్ గా గ్యాంగ్ స్టార్ లుక్ లో వరుణ్ పర్సనాలిటీ సూపర్బ్. తెలంగాణ భాషలో వరుణ్ చెప్పిన మాస్ డైలాగ్స్ చాలా బావున్నాయి. గ్లామర్ రోల్ లో మాస్ మేనరిజంతో వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. గణేష్ పాత్రలో వరుణ్ మాస్ లుక్ కటౌట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన తమిళ నటుడు అధర్వ మురళి పర్వాలేదనిపించాడు. కమెడియన్ సత్య మాత్రం తన హావభావలు, మేనరిజంతో అలరించాడు. ఇక శ్రీదేవి గా పూజ హెగ్డే లంగావోణీ లుక్ లో ఆకట్టుకుంది. కొత్తమ్మాయి మృణాళిని అభినయంతో నటనతో ఆకట్టుకుంది.


విశ్లేషణ:


హరీష్ - వరుణ్ కాంబోలో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా ప్రారంభమైన వెంటనే వరుణ్ తేజ్ కనిపించే తొలి సన్నివేశమే అద్భుతంగా ఉంది. ఈ సన్నివేశంతో క్యూరియాసిటీ క్రియేట్ చేసి కథను ఆరు నెలల వెనక్కి తీసుకెళ్లారు. ఇక అక్కడి నుంచి గద్దలకొండ గణేష్ అరాచకం మొదలవుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మినహా ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వరుణ్ తేజ్ మేనరిజం, డైలాగులు, సత్య కామెడీ ప్లస్ అయ్యాయి. ఇంటర్వెల్‌ బ్లాక్‌లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సెకండాఫ్‌లో చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ... సెకండాఫ్ కాస్త నీరసించింది. సెకండ్ హాఫ్ లో ఎంటర్‌టైన్మెంట్ లోపించింది. దీనికి తోడు నిడివి కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. అసలు రౌడీ షీటర్ ఒక హీరోగా పరిచయమైన తీరు లాజిక్‌కు అందని విధంగా ఉంది. కాకపోతే పూజా మరియు వరుణ్ ల మధ్య సన్నివేశాలు తక్కువే ఉన్నా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చక్కగా కుదిరింది. క్లైమాక్స్ కాస్త వీక్‌గానే ఉన్నా ఎమోషన్స్ బాగానే పండాయి.


సాంకేతికంగా...


సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. నాలుగు చక్కని పాటలతో మంచి మ్యూజిక్ ఇవ్వడమే అక్కడు.. మొదటిసారి విభిన్నమైన బ్యాగ్రౌండ్ స్కోరు ఇచ్చాడు. మిక్కీ నేపధ్య సంగీతం సినిమాలో హైలెట్ అవుతుంది. ఆయాంక్ బోస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. అయన గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ముఖ్యంగా వరుణ్ తేజ్‌ను అద్భుతంగా కెమెరాలో బంధించాడు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. కాని తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.


ప్లస్ పాయింట్స్: వరుణ్ లుక్, డైలాగ్ డెలివరీ, సినిమాటోగ్రఫి, మ్యూజిక్, నేపధ్య సంగీతం


మైనస్ పాయింట్స్: అధర్వ పాత్ర, ఎడిటింగ్, క్లైమాక్స్, సెకండ్ హాఫ్రే


రేటింగ్: 2.5/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa