బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నిజ జీవితంలో ఓ భయంకరమైన నొప్పితో పోరాడుతున్నారు. ఆ నొప్పి భరించలేక కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పి ఆయన అభిమానులను, సినీ ప్రపంచాన్ని షాక్కు గురిచేశారు. ఏళ్లుగా తనను వేధిస్తున్న ఓ అరుదైన వ్యాధి గురించి సల్మాన్ తాజాగా పంచుకున్న విషయాలు అందరినీ కలచివేస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటీమణులు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి నిర్వహిస్తున్న 'టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్' అనే టాక్ షోకు సల్మాన్ ఖాన్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను 'ట్రైజెమినల్ న్యూరల్జియా' అనే అరుదైన నరాల వ్యాధితో కొన్నేళ్లుగా బాధపడుతున్నట్లు వెల్లడించారు. "ఈ వ్యాధి వల్ల కలిగే నొప్పిని మాటల్లో వర్ణించలేం. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే, నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చేవి. ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం" అని సల్మాన్ భావోద్వేగంతో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa