వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ మరో సినిమా చేయబోతున్నారు. NBK111 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 24న పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా రెండు వేర్వేరు కాలాలకు చెందిన కథ అని, చరిత్రను వర్తమానంతో ముడిపెడుతూ టైమ్ ట్రావెల్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అర్వింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్ గా, తమన్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa