ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమిటీ కుర్రోళ్లు కాంబో మళ్ళీ రిపీట్..

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 06:50 PM

గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన 'కమిటీ కుర్రోళ్లు' కాంబో మరోసారి రిపీట్ కానుంది. యంగ్ డైరెక్టర్ యదు వంశీ, నిహారిక కొణిదెలతో కలిసి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మరో సినిమాను రూపొందించడానికి చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. 'కమిటీ కుర్రోళ్లు' సినిమా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది. రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మొత్తం రూ.24.5 కోట్లు రాబట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa