కార్తీక్ రాజు దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన '#సింగిల్' చిత్రం భారీ అంచనాల మధ్య మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 3 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా తొలి టెలికాస్ట్ లోనే 2.21 టీఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. కేతిక శర్మ మరియు ఇవానా ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వెన్నెలా కిషోర్, ప్రభాస్ శ్రీను, గణేష్, రాజేంద్ర ప్రసాద్, సీత ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మానస చౌదరి మరియు రెబ మోనికా మరియు నార్నె నితిన్ అతిధి పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేశారు. కల్యా ఫిలిం సహకారంతో నిర్మించిన ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa