ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారుల భద్రతపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 10:28 AM

మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి హత్య ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందని, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభించడం వల్లే మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వంలో రాష్ట్రంలో మ‌హిళ‌లు, బాలిక‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వ‌రుదు క‌ళ్యాణి ఆక్షేపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa