ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జేఈఈ టాపర్స్‌ కి అభినందనలు తెలిపిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 10:35 AM

జేఈఈ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కఠినమైన పోటీ పరీక్ష అయిన జేఈఈలో ప్రతిభ కనబరిచి ఉన్నత ర్యాంకులు సాధించడం విద్యార్థుల ప్రతిభ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం మరియు భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర యువత ఇలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa