AP: కలియుగ ఇలవైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. కేవలం నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేనివారికి 6 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3-4 గంటల్లో దర్శనం లభిస్తుందని టీటీడీ తెలిపింది. కొత్తగా కంపార్టుమెంట్లలోకి వెళ్లేవారికి 6-8 గంటలు, రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 2-3 గంటల సమయం పట్టవచ్చని పేర్కొంది. మంగళవారం 70,509 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 18,058 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు.తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 16న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 24 వరకూ జరగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల వరకూ వాహనసేవలు జరగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు హంసవాహనంపై ఊరేగారు. నేడు సింహవాహనంపై స్వామివారు భక్తులకు అభయమివ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa