ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగి పడుకుంటే

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 12:12 PM

రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిదని అమెరికన్ హార్ట్ అసోసిషన్ చెబుతోంది. రాత్రి సమయాల్లో రక్తప్రసరణకు ఇది బాగా ఉపయోగపడుతుందని తెలియజేసింది. నిద్రపోయే సమయంలో దేహం సహజంగా కొంత ద్రవపదార్థాలను కోల్పోతుంది . చెమట పట్టడం , నిద్రలో కదలికలు వల్ల కూడా నీటిని కోల్పోతుంది.  దీనివల్ల రక్తం  కొంచెం చిక్కబడే అవకాశం కూడా ఉంటుంది. ఒక మోస్తారు నీటి కొరత  గుండె మీద భారం పెంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల ఒక గ్లాస్ నీళ్లు తాగితే ఆ ఇబ్బంది తగ్గుతుందని తెలిపింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధనలో ఇది ప్రాథమికంగా రుజువైంది. తరచూ నీటిని తీసుకుంటున్నడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది అని హృద్రోగ సంబంధం అయిన విషయాల్లో అది ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు.  తరచూ నీటిని తీసుకుంటూ ఉంటే గుండె సంబంధమైన వ్యాధుల విషయంలో చాలా మంచి చేస్తుందనడంలో  సందేహం లేదని హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. అందువల్ల నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగితే రాత్రంతా మనకు తెలియకుండానే డీహైడ్రేషన్ నుంచి దేహం బయటపడుతుందని, పగలు ఎక్కువ నీళ్లు తాగలేని వారికి ఇది మరింత మంచి చేస్తుందని ఆ నివేదిక తెలిపింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa