అవ్వాల్ నంబర్ ప్రొడక్షన్స్ యొక్క తొలి చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు లాంచ్ చేసారు. ఈ చిత్రానికి 'అమీర్ లాగ్' అని పేరు పెట్టారు. హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వేదశ్రీ, రావణ్ నిట్టూరు, సాయి యోగి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రమణ రెడ్డి సోమా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సినిమాటోగ్రాఫర్‌గా ఎస్‌వీకె, సంగీత దర్శకుడిగా స్మారన్ సాయి, మరియు రోహిత్ పెనుమాట్సా ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. మాధవి రెడ్డి సోమా ఈ చిత్రాన్ని నిర్మించగా, మనోహర్ రెడ్డి మంచూరి సహ నిర్మాతగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa