ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పేరం ప్రవీణ్ (13) అక్కడికక్కడే మృతి చెందగా, గొర్రెముచ్చు సాయి, సనా (10)లకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సనా మరణించింది. రోడ్డు పక్కన ఉన్న మామిడి చెట్ల మొద్దులను తప్పించబోయి ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa