హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఇటీవల ఆయన సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించకపోయినా ఇప్పుడు 'జటాధర' సినిమాతో సాలిడ్ కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అసాధారణమైన క్యూరియాసిటీ నెలకొంది. రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా 'జటాధర' ట్రైలర్ లాంచ్ కానుంది. మహేష్ బాబు ట్రైలర్ లాంచ్ చేస్తుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.ఇప్పటివరకు సుధీర్ బాబు సినిమాలకు ఉన్న క్రేజ్ వేరే అయినా, ‘జటాధర’పై జనాల్లో అసాధారణమైన క్యూరియాసిటీ నెలకొంది. రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచుతూ ఉన్నాయి.