సుప్రీం హీరో సాయి ధరం తేజ్ , రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వం వహిస్తున్న ప్రతిరోజు పండగే... చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పురోగమిస్తోంది. మెగా హీరో , రాశీ తో రొమాన్స్ చేస్తున్న స్టిల్స్ తాజాగా సామాజిక మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వరుస ఫ్లాపులను ఎదుర్కొన్న సాయి ధరం తేజ్ ఈ మధ్య చిత్రలహరితో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ప్రతీరోజు పండగేతో ఆవిజయ పరంపరను కొనసాగింస్తుదన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడాయన. గీతా ఆర్ట్స్ మరియు యువి క్రియేషన్స్ సంయుక్తంగా బ్యాంక్రోల్ చేసిన ఈ చిత్రంలో సత్యరాజ్ సాయి ధరం తేజ్ తాతగా, రావు రమేష్ తన తండ్రి పాత్రలో నటిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గ్రామీణ కథాంశంతో రూపొందే ఈ చిత్రం క్రిస్‌మస్ స్పెషల్‌గా డిసెంబర్‌లో తెరపైకి రానుందని చిత్రవర్గాలు చెప్పాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa