ఈటీవీ విన్‌తో కలిసి శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ నిర్మించిన రాబోయే క్రైమ్-కామెడీ-థ్రిల్లర్ చిత్రం కోసం నటినటులు శివాజీ మరియు లయ 14 సంవత్సరాల తర్వాత తెరపై మళ్లీ కలుస్తున్నారు. కొత్త దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్న లయ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. హిట్ వెబ్ సిరీస్ 90's లో శివాజీతో కలిసి పనిచేసిన రోహన్ రాయ్ కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa