టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మరియు మన శంకర వరప్రసద్ గారు అనే ప్రాజెక్ట్స్ లో పని చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి యొక్క కొత్త చిత్రం తాత్కాలికంగా 'మెగా 158' పేరుతో ప్రకటించబడింది. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ కోలీవుడ్ నటుడు కార్తీ ఆన్ బోర్డులో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మెగా 158 మేకర్స్ ఈ వార్త నిజం లేదని ధృవీకరించింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa