ప్రభాస్–మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రం వాయిదా పడలేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమాను జనవరి 9న అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌లో అమెరికాలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా, సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa