దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా సోషల్ మీడియాలో ఓ కొత్త చర్చ మొదలైంది.ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన ఒక పోస్టర్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. ఆ పోస్టర్‌లో పృథ్వీరాజ్ ఒక చక్రాల కుర్చీలో కూర్చొని ఉండగా, ఆయన వెనుక భాగంలో యాంత్రికమైన చేతులు ఉన్నట్లుగా డిజైన్ చేశారు. ఈ లుక్ బయటకు రాగానే, కొందరు నెటిజన్లు రాజమౌళిపై కాపీ ఆరోపణలతో ట్రోలింగ్ ప్రారంభించారు.సూర్య కథానాయకుడిగా నటించిన '24' సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కూడా చక్రాల కుర్చీలోనే ఉంటుందని, ఆ పాత్రకు, ఈ పోస్టర్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. కొందరైతే ఒక కార్టూన్ క్యారెక్టర్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో 'రాజమౌళి మళ్లీ కాపీ కొట్టారు' అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa