మహేష్ బాబు అన్న దివంగత నటుడు రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సందర్బంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదలైంది. 'ఆర్ఎక్స్ 100' 'మంగళవారం' ఫేమ్ అజయ్ భూపతి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు 'శ్రీనివాస మంగాపురం' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. ఇక ఈ చిత్రంతో జయకృష్ణ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa