రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన ఓ కామెడీస్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది. ఆ షోకు ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి హాజరయ్యారు. వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో 'గుల గుల గులాబ్ జామ్' అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చింది. వెంటనే మా తదుపరి చిత్రంలో నటిస్తావా అని ఎస్వీ కృష్ణారెడ్డి వేణుమాధవ్ ని అడిగారు. అలా వేణుమాధవ్ కు 1996లో 'సంప్రదాయం ' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి గాను వేణు మాధవ్ 70 వేలు పారితోషికం అందుకున్నారు. నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం, వేణుమాధవ్ హాస్యానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో బిజీ కమెడియన్ గా మారిపోయాడు. ఆ తర్వాతి కాలంలో వేణుమాధవ్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో హీరోగా హంగామా లాంటి చిత్రాల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa