హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి, సీవెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు 96వ జన్మదినవేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విప్లవ చిత్రాల దర్శకుడు, ప్రజానటుడు ఆర్. నారాయణమూర్తిని అక్కినేని వెండికిరీటంతో ఘనంగా సత్కరించారు. మాజీస్పీకర్ మధుసూధనాచారి, శృతిలయ ఛైర్మన్ ఆర్ ఎన్ సింగ్, శృతిలయ ప్రెసిడెంట్ భీమ్ రెడ్డి , పద్మశ్రీ పిక్ఛర్స్ అధినేత్రి పద్మాభూపతి, లక్ష్మీఫిలింస్ కంబైన్స్ నిర్మాత అనురాధాదేవి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఆర్ నారాయణమూర్తి ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరారు. ఈ సందర్భంగా వక్తలంతా ఆర్. నారాయణ మూర్తి తెరకెక్కించిన చిత్రాలను, ఆయన నటనను కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa